Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ లో సంచలనం.. శివయ్య పిలుస్తున్నాడంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి..!

హైదరాబాదులో సంచలన సంఘటన జరిగింది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad : హైదరాబాద్ లో సంచలనం.. శివయ్య పిలుస్తున్నాడంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాదులో సంచలన సంఘటన జరిగింది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి.. పర్వతాపూర్ లో సాయి ఐశ్వర్య కాలనీలో నివాసం ఉండే బెల్లంకొండ శైలజ కుమార్తె మధు హాసిత (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంట్లోనే ఉంటుంది.

ఈనెల 27వ తేదీన తల్లి శైలజ బయటకి వెళ్లి ఇంటికి రాగా హాసిత కనిపించలేదు. ఈ క్రమంలో ఇంట్లో వెతకగా లేఖ కనిపించని, నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను.. దేవుడు శివయ్య పిలుస్తున్నాడు అని ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఇదిలా ఉండగా గతంలో ఆ కుటుంబం లాలాపేటలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు మందలించగా గత పది నెలలుగా ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా ఎవరితో మాట్లాడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు