Nalgonda : ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నగదు బహుమతుల పంపిణీ..!
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Nalgonda : ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నగదు బహుమతుల పంపిణీ..!
నల్గొండ, మనసాక్షి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
నిర్వహించిన విద్యా విజయోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన 13 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. కేజీబి వి మరియు మోడల్ స్కూల్లకు చెందిన 5 మంది విద్యార్థులు, స్పోర్ట్స్ స్కూల్ నుండి 4 మంది, జూనియర్ కళాశాలల నుంచి 3 విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇష్టంతో, కష్టపడి చదవాలని చెప్పారు. పదవ తరగతితో చదువును ఆపకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివితేనే నేటి పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రాడ్యుయేషన్ విద్యతో జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. పై చదువులకు వెళ్లే విద్యార్థులకు సరైన దిశానిర్దేశం అవసరమని, ఉపాధ్యాయులు, ఎంఈఓలు విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు.అనంతరం మానసిక దివ్యాంగులకు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ అందజేసి వారి పట్ల సామాజిక బాధ్యతను తెలియజేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి దస్రునాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి , ఎంఈఓ లు , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.











