ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనరును ఢీ కొట్టిన కారు..!
కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు. ఈ ఘటన వెల్దండ మండలంలోని కొట్ర తండ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనరును ఢీ కొట్టిన కారు..!
వెల్దండ, మన సాక్షి:
కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు. ఈ ఘటన వెల్దండ మండలంలోని కొట్ర తండ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వంగూర్ మండలం సర్వారెడ్డి పల్లి (కిష్టం పల్లి) గ్రామానికి చెందిన జాజాల జయమ్మ (34) గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి సోమవారం ఓ వివాహానికి హాజరై హైదరాబాద్ బయలుదేరుతున్న అర్ధరాత్రి సమయంలో కొట్ర తండ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ కంటైనర్ను వీరి కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కుమార్తెలు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఇది గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.