Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : త్రిపుర గవర్నర్ కు ఘన స్వాగతం..!
నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ .ఇంద్రసేనారెడ్డికి రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు .

Nalgonda : త్రిపుర గవర్నర్ కు ఘన స్వాగతం..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ .ఇంద్రసేనారెడ్డికి రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు . గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డికి రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి లు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.










