Vikarabad : వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన.. వృద్ధురాలి నగలపై కన్నేసిన జంట, హత్య చేసి ఆపై ఏం చేశారో తెలిస్తే షాక్..!
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చోటు చేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది . కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్లికిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని దారుణ హత్య చేసి, అనంతరం సాక్షాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.

Vikarabad : వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన.. వృద్ధురాలి నగలపై కన్నేసిన జంట, హత్య చేసి ఆపై ఏం చేశారో తెలిస్తే షాక్..!
కుల్కచర్ల, మన సాక్షి:
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చోటు చేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది . కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్లికిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని దారుణ హత్య చేసి, అనంతరం సాక్షాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
బండ వెల్కిచర్ల గ్రామానికి చెందిన వెంకటమ్మ (60) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఆమె వద్ద ఉన్న బంగారు నగలపై కన్నేసిన ఇరుగు పొరుగు వారు ముందుగా పథకం రచించి ఇదే గ్రామానికి చెందిన మంజుల ఆమె భర్త బీరప్ప అరుణ్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
ముందస్తుగానే ప్లాన్ చేసిన ఈ నేరంలో భాగంగా వెంకటమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో చున్నీతో గొంతు నుదిమి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు తమ నేరని కప్పిపుచ్చుటకు తీవ్రంగా ప్రయత్నించారు. శవాన్ని తిరుమలపూర్ అటవీ ప్రాంతం పాండవుల బండ దగ్గరకు తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పు అంటించడం జరిగింది. శవాన్ని పూర్తిగా కాల్చి సాక్షాలు మాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారు.
అనంతరం ఆభరణాలను మరియు సెల్ ఫోన్ లను కాముని పల్లి గ్రామంలో దాచినట్లు తెలిసింది. ఏప్రిల్ 8 2026 నాడు నిందితురాలు చీపిరి మంజులను విచారించగా ఈ నేరాన్ని నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. ఈమె ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకొని ముగ్గురు కలిసి ఈ నేరని చేసినట్లు ఒప్పుకున్నారు. మృతురాలి ఆభరణాలు గోల్డ్ నక్లెస్, చెవి సాదా కమ్మలు, 22 బంగారు గుడ్లు, వెండి పట్టీలు, వెండి కడియాలు, రెండు సెల్ ఫోన్ లు మరియు రెండు బైకులను నిందితుల నుండి సామాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసును త్వరగా ఛేదించినందుకు కుల్కచర్ల స్థానిక స్థానిక ఎస్సై రమేష్ కుమార్ ను మరియు పోలీస్ బృందంను పరిగి డిఎస్పి శ్రీనివాసులు అభినందించారు. పరిగి సర్కిల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, కుల్కచర్ల స్థానిక ఎస్సై రమేష్ కుమార్,రైటర్ శంకరయ్య, సి సి టి ఎస్ ఎస్ రాఘవేందర్, బీసీలు భూపాల్ రెడ్డి, శివ, గోపాల్, మరియు మొగులయ్య సేవలను అభినందించడం జరిగింది.










