Nalgonda : 13 నుండి అరైవ్ అలైవ్.. రోడ్డు భద్రత వారోత్సవాలు..!
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాలు ఈ నెల 13 నుండి 18 వరకు వారం రోజులపాటు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Nalgonda : 13 నుండి అరైవ్ అలైవ్.. రోడ్డు భద్రత వారోత్సవాలు..!
నల్లగొండ, మన సాక్షి:
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాలు ఈ నెల 13 నుండి 18 వరకు వారం రోజులపాటు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమాల అమలుపై జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, డ్రైవర్ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
వారం రోజులపాటు గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం, ప్రమాదాలకు కారణమయ్యే రోడ్ల సమస్యలు, బ్లైండ్ స్పాట్స్ గుర్తించడం,జీబ్రా క్రాసింగ్‌లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా ఆటో, బస్, టాక్సీ, స్కూల్ బస్ డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం, డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాల తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనపై గోల్డెన్ అవర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, పోలీస్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లకు ఫస్ట్ ఎయిడ్ పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొని రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
MOST READ :
- District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. యోగ జీవితంలో భాగం కావాలి..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోరం.. పెళ్లి మొక్కు చెల్లించేందుకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం..!
- Sprouts : మొలకలు తినడం మంచిదేనా.. ఎవరు తినకూడదు, ఏ సమయంలో తింటే మంచిది..!
- Narayanpet : ఐదేళ్ల బాలిక హత్య కేసులో కీలక మలుపు.. మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ..!









