Mangli : సింగర్ మంగ్లీ పై పంజాగుట్ట లో కేసు నమోదు..!
సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి కి బిగ్ షాక్ తగిలింది. మోసం చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Mangli : సింగర్ మంగ్లీ పై పంజాగుట్ట లో కేసు నమోదు..!
మన సాక్షి, హైదరాబాద్ :
సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి కి బిగ్ షాక్ తగిలింది. మోసం చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. వ్యాపారం, పెట్టుబడుల పేరుతో సుమారు 10 కోట్ల రూపాయల మేర తనను మోసం చేశారంటూ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది.
సుమారు 100 మంది అమాయక బాధితుల నుంచి 10 కోట్లకు పైగా వసూలు చేశారని ప్రధాన ఆరోపణ నెలకొన్నది. అయితే ఏళ్లు గడుస్తున్నా కూడా లాభాలు ఇవ్వకపోగా, కనీసం అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల తరపున నిలదీసిన లాయర్ సుబ్బారావును మంగ్లీ టీం బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీ ఏ (5), ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై బిఎన్ఎస్ సెక్షన్లు 351 ( 2) 352 కింద కేసులు నమోదు చేశారు.
MOST READ :
- Nalgonda : 13 నుండి అరైవ్ అలైవ్.. రోడ్డు భద్రత వారోత్సవాలు..!
- భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య.. ఊహించని ట్విస్ట్..!
- Hyderabad : మద్యం మత్తులో బైకును ఢీ కొట్టిన కారు.. మిర్యాలగూడ, హాలియా ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి..!
- Sprouts : మొలకలు తినడం మంచిదేనా.. ఎవరు తినకూడదు, ఏ సమయంలో తింటే మంచిది..!









