Narayanpet : వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జి పై పోలీసుల దాడులు..!
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్ లో వ్యభిచారం, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు.

Narayanpet : వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జి పై పోలీసుల దాడులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్ లో వ్యభిచారం, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. అలాగే లాడ్జ్ యజమాని బుగ్గేశ్వర్ పై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు.
పట్టుబడిన మహిళలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారికి అవసరమైన సహాయం అందించే చర్యలు చేపట్టారు. అనంతరం వారిని స్టేట్ హోమ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడుల్లో పాల్గొన్న కానిస్టేబుల్ సంతోష్, మహిళ కానిస్టేబుల్స్ శిరీష, అర్చన పాల్గొన్నారు.









