Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. ఏపీకే ఫైల్స్ తో జాగ్రత్తగా ఉండాలి..!

ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతుల ను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రజలందరికీ అవగాహన, అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అడ్డుకోగల మని ఒక ప్రకటనలో తెలిపారు.

Narayanpet : జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. ఏపీకే ఫైల్స్ తో జాగ్రత్తగా ఉండాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతుల ను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రజలందరికీ అవగాహన, అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అడ్డుకోగల మని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, స్టాక్ మార్కెటింగ్ అంటూ లాభాలు చూపిస్తామంటూ ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న మోసాలు సామాన్య ప్రజలకు తెలియాలని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

అదేవిధంగా వాట్సాప్ నందు టెలిగ్రామ్ నందు సోషల్ మీడియాలలో ఏపీకే ఫైల్స్ రావడం వాటి ద్వారా మొబైల్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం లాంటి సంభవిస్తుందని వాటిని అడ్డుకోవడానికి అప్రమత్తత ప్రధానాస్త్రంగా ఉంటుందని తెలిపారు. ఒకవేళ మోసగాళ్ల చేత మోసపోయినట్లయితే వెంటనే (గోల్డెన్ హవర్) లో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయడం మొదటి కర్తవ్యం గా వ్యవహరిస్తుందని తెలిపారు.

ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులు వినియోగిస్తున్న నూతన పద్ధతులు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, యూపీఐ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్లు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటిది జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముఖ్యంగా యువత మాయమాటలకు నమ్మి మోసపోకుండా ఉండాలని తెలిపారు.

సైబర్ క్రైమ్ నేరగాళ్లు వినియోగిస్తున్న పద్ధతిని తెలియజేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు ముఖ్యంగా డబ్బులను వారి సొంత వెబ్సైట్ ల నందు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా ఎక్కువగా చూపిస్తారని ఒకవేళ డబ్బులను తీయాలి అనుకుంటే రాకుండా ఉంటాయని తెలియచేశారు. జిల్లా పరిధిలో ప్రజలకు సైబర్ నేరాల పైన విస్తృతంగా అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు