Talent : పట్టుదలతో పేదరికాన్ని జయించిన గురుకులం విద్యార్థిని.. ఇంటర్ లో టాప్..!
పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని వెంకటాపురం(కె) గ్రామానికి చెందిన చింతల శ్రీలత నిరూపించింది. చింతల లింగయ్య కుమార్తె అయిన శ్రీలత, ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Talent : పట్టుదలతో పేదరికాన్ని జయించిన గురుకులం విద్యార్థిని.. ఇంటర్ లో టాప్..!
గుర్రంపోడు, మన సాక్షి :
పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని వెంకటాపురం(కె) గ్రామానికి చెందిన చింతల శ్రీలత నిరూపించింది. చింతల లింగయ్య కుమార్తె అయిన శ్రీలత, ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.శ్రీలత తన ప్రాథమిక విద్యను (3, 4 తరగతులు) వెంకటాపురం(కె) లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో పూర్తి చేసింది.
అనంతరం 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నల్గొండలోని SLBC బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యనభ్యసించింది. మొదటి నుండి చదువులో చురుగ్గా ఉండే శ్రీలత, ఇప్పుడు ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు సాధించి తన గ్రామానికి,పాఠశాలకు మంచి పేరు తెచ్చింది.శ్రీలతకు ప్రాథమిక పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మారం జగదీశ్వర్ రెడ్డి ఆమె ప్రతిభను చూసి గర్విస్తున్నారు.
చిన్నతనం నుంచే శ్రీలత ఎంతో క్రమశిక్షణతో, నేర్చుకోవాలనే తపనతో ఉండేదని, ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీలత సాధించిన ఈ విజయానికి తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









