Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Rythu : రైతులకు బిగ్ అలర్ట్.. ఒకే మొబైల్ నెంబర్ ను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..!

రైతులు ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా, ఫార్మర్స్ రిజిస్ట్రీ మరియు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లలో ఒకే మొబైల్ నెంబర్‌ ద్వారా నమోదు చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ కుమారి పేర్కొన్నారు.

Rythu : రైతులకు బిగ్ అలర్ట్.. ఒకే మొబైల్ నెంబర్ ను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..!

ప్రభుత్వ పథకాలు, ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు

వెంటనే ఏఈఓలను సంప్రదించాలని ఏఓ శ్రావణ కుమారి సూచన

చింతపల్లి, మనసాక్షి :

రైతులు ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా, ఫార్మర్స్ రిజిస్ట్రీ మరియు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లలో ఒకే మొబైల్ నెంబర్‌ ద్వారా నమోదు చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ కుమారి పేర్కొన్నారు.

సోమవారం ఆమె చింతపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రైతులు ఈ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూడు విభాగాల్లో వేర్వేరు నెంబర్లు ఉన్నట్లయితే, భవిష్యత్తులో ఎరువుల బుకింగ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.

ఒకవేళ నెంబర్లు వేర్వేరుగా ఉన్నా లేదా పాత నంబర్ అందుబాటులో లేకపోయినా, వెంటనే సంబంధిత అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లను (ఏఈఓ) సంప్రదించి ఒకే నంబర్ ఉండేలా అప్‌డేట్ చేయించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రభుత్వ లబ్ధి నేరుగా, వేగంగా అందుతుందని ఆమె వివరించారు. ఈ సమావేశ కార్యక్రమంలో ఏఈవోలు రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు