Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

CI Venkat reddy : సురక్షిత ప్రయాణమే పోలీసుల లక్ష్యం.. సిఐ వెంకట్ రెడ్డి..!

రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'అరైవ్- అలైవ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సిఐ వెంకట్ రెడ్డి అన్నారు.

CI Venkat reddy : సురక్షిత ప్రయాణమే పోలీసుల లక్ష్యం.. సిఐ వెంకట్ రెడ్డి..!

కంగ్టి, మన సాక్షి :

రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సిఐ వెంకట్ రెడ్డి అన్నారు. కంగ్టి మండల తడ్కల్ రైతు వేదికలో సోమవారం రోడ్డు భద్రతపై ఎస్ఐ దుర్గారెడ్డి, సర్పంచ్ సుగుణ మల్లారెడ్డితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. హెల్మెట్ ధరిస్తే అది మీ ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలన్నారు. యువత డ్రంక్ అండ్ డ్రైవ్ దూరంగా ఉండాలన్నారు.

ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరాలన్నదే పోలీసుల లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి జ్ఞాన్ దేవ్, ఉప సర్పంచ్ సమీర్, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, వివోఏలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు