Nizamabad : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..!
ఆర్మూర్ శివారులోని పెర్కిట్ సమీపంలో గల తిరుమల గార్డెన్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Nizamabad : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..!
ఆర్మూర్, మన సాక్షి
ఆర్మూర్ శివారులోని పెర్కిట్ సమీపంలో గల తిరుమల గార్డెన్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో మూడు ముక్కల పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన కళ్ళు వ్యాపారి రత్నగిరి శంకర్ గౌడ్, నిర్మల్ శాస్త్రి నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుంకరి మహేష్, నిర్మల్ దివ్యా నగర్‌కు చెందిన మాదారపు అభిలాష్, భైంసా టౌన్ మార్కెట్ ఏరియాకు చెందిన సయ్యద్ ఆసిఫ్ ఉన్నారు. వీరితో పాటు ఆర్మూర్ 25వ వార్డు కౌన్సిలర్ మెడిదల వెంకట గౌడ్ (రవి గౌడ్), భైంసా మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల దత్తాద్రి కూడా పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
నిందితుల నుంచి లక్షా 79 వేల 940 రూపాయల నగదుతో పాటు టీఎస్ 09 ఎఫ్ఆర్ 4975 నెంబర్ గల టయోటా ఇటియోస్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారితో పాటు అక్కడ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









