Maize : మొక్కజొన్న క్వింటా రూ.2400.. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే..!
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ దేయమని, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Maize : మొక్కజొన్న క్వింటా రూ.2400.. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే..!
వెల్దండ, మన సాక్షి:
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ దేయమని, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పొల్యూషన్ కమిటీ సభ్యుడు బాలాజీ సింగ్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న క్వింటాల్ ధర రూ.2400 రూపాయలు, రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం ద్వారా మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు.రైతులను రాజులను చేయాలని సంకల్పంతోనే ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భీష్మ కార్తీక్ కుమార్, ఎంపీడీవో కృష్ణయ్య, శ్రీనివాసులు, శోభారాణి, మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, సర్పంచ్లు మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, రవీందర్ నాయక్, గన్య నాయక్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు భూపతి రెడ్డి, డిసిసి కార్యదర్శి మోతిలాల్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు హరి కిషన్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, నాయకులు కేసముల్ల కృష్ణ, కిష్టాల్, ముదిగొండ రమేష్, పురుషోత్తం చారి , లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.









