ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య
Talent : చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది.. ఇంటర్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తులసి..!
చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది నిరుపేద విద్యార్థిని తులసి.

Talent : చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది.. ఇంటర్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తులసి..!
రామసముద్రం, మనసాక్షి
చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది నిరుపేద విద్యార్థిని తులసి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు గ్రామపంచాయతీ దిన్నిపల్లె సమీపంలో ఉన్నా కస్తూరిభాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సి ఈ సి బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థిని ఏ. తులసి 915/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ మస్తాన్ భీ తెలిపారు. ఈ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తులసి తండ్రి గ్రామాలకి వెళ్లి మిక్షీలు రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితిల్లోను కృషి చేసి అగ్రస్థానంలో నిలిచినతులసిని గ్రామస్థులు, మండల ప్రజలు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.









