Suryapet : ధాన్యం తుకాల్లో మోసం రైతుల కష్టం దోపిడీ..!
వేబ్రిడ్జ్ మోసంతో రైతుల కష్టానికి నష్టం వాటిల్లిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ళ మల్కాపురం గ్రామంలోని వేబ్రిడ్జ్ మోసం వెలుగులోకి వచ్చింది.తూకం వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

Suryapet : ధాన్యం తుకాల్లో మోసం రైతుల కష్టం దోపిడీ..!
గరిడేపల్లి, మన సాక్షి :
వేబ్రిడ్జ్ మోసంతో రైతుల కష్టానికి నష్టం వాటిల్లిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ళ మల్కాపురం గ్రామంలోని వేబ్రిడ్జ్ మోసం వెలుగులోకి వచ్చింది. తూకం వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
వెలిదండ గ్రామానికి చెందిన గండు సతీష్ ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట పైరు బోరెంలో పోసుకుని తాళ్ల మల్కాపురం శ్రీ వెంకటేశ్వర వెయిట్ బ్రిడ్జి లో వేమెంట్ పెట్టగా 4440 కాంటా వచ్చింది.అక్కడ నుంచి మిర్యాలగూడ వైష్ణవి మిల్లుకి పోగా అక్కడ కూడా వేమెంట్ పెట్టడంతో 4560 కాంట వచ్చింది.120 కేజీలు తక్కువ రావడంతో రైతు శ్రీ వెంకటేశ్వర వెయిట్ బ్రిడ్జి యాజమాన్యం యమగాని అనిల్ ని అడిగితే మా ఇష్టం మా దగ్గర అలానే వస్తుంది క్వింటా కాకపోతే మూడు క్వింటాలు తేడ వస్తుందని రైతుతో దురుసుగా ప్రవర్తించడని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ మోసం కారణంగా రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన ధర రావాల్సిన చోట,తూకం లోపాల వల్ల నష్టం వాటిల్లుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకున్న కానీ శ్రీ వెంకటేశ్వర వెయిట్ బ్రిడ్జి తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే వేబ్రిడ్జ్పై తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.









