Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలువిద్యహైదరాబాద్

తల్లిదండ్రులను గౌరవించాలి..!

తల్లిదండ్రులను గౌరవించాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్ సుఖ్ నగర్ జోనల్ ఏజీఎం వెంకట్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.

తల్లిదండ్రులను గౌరవించాలి..!

మన సాక్షి, హైదరాబాద్ :

తల్లిదండ్రులను గౌరవించాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్ సుఖ్ నగర్ జోనల్ ఏజీఎం వెంకట్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ లో శనివారం విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏటీఎం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అంజనీదేవి మాట్లాడుతూ ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ రఘు వంశీ, డీన్ రఘుపతి, సి బ్యాచ్ ఇన్ చార్జి సోమయ్య, ప్రైమరీ ఇన్ చార్జి స్వరూప రాణి, ఏవో ప్రమోద్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు