పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పై కేంద్రం క్లారిటీ..!
పెట్రోలియం, డీజిల్ పెంపు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 25 రూపాయలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలతో వాహనదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పై కేంద్రం క్లారిటీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
పెట్రోలియం, డీజిల్ పెంపు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 25 రూపాయలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలతో వాహనదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అయితే అవి ఫేక్ వార్తలని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా స్పష్టం చేసింది. అలాంటి వార్తలు కేవలం ప్రజలను భయాందోళనలకు గురి చేసేవని తేల్చి చెప్పింది.
పెట్రోలియం, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏది ప్రభుత్వం ముందు లేదని పెట్రోలియం శాఖ అధికారికంగా ప్రకటించింది. ధరలు పెరుగుతాయనే ప్రచారం వెనుక దుర్దేశాలు ఉన్నాయని, అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ మన దేశంలో మాత్రం రేట్లు స్థిరంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ లో కీలకమైన విషయాన్ని వెల్లడించింది. గత నాలుగు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని ఏకైక దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే అని గర్వంగా ప్రకటించింది. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో కూడా చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నప్పటికీ భారత్ లో మాత్రం ప్రభుత్వ సంస్థలు తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల సామాన్యుడిపై భారం పడకుండా కాపాడగలిగామని పేర్కొన్నది. కేంద్రం పెట్రోలియం శాఖ అధికారిక ప్రకటనతో వాహనదారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.










