Narayanpet : ఘనంగా ప్రారంభమైన చౌడేశ్వరి మాత మహోత్సవాలు..!
నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామం గల చౌడేశ్వరిమాత దేవాల యంలో దేవాంగ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ చౌడేశ్వరి మాతకు కుంభోత్సవ వేడుకలు ఆదివారం నుండి భక్తశ్ర ద్దలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి

Narayanpet : ఘనంగా ప్రారంభమైన చౌడేశ్వరి మాత మహోత్సవాలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
నారాయణపేట మండల పరిధిలోని
జాజాపూర్ గ్రామం గల చౌడేశ్వరిమాత దేవాల యంలో దేవాంగ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ చౌడేశ్వరి మాతకు కుంభోత్సవ వేడుకలు ఆదివారం నుండి భక్తశ్ర ద్దలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆది వారం మొదటి రోజు తెల్లవారు జామున అమ్మవారికి మహా అభిషేకం, పసుపు కుంకుమా భిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు.
వేదంపండితులు వెంకు శాస్త్రి మంత్రోచ్ఛారణలతో మహాగణపతి విగ్రహ ప్రతి ష్టాపన కార్యక్రమమంతో పాటు ఉదయం 10 గంటలకు దంపతులచేత యజ్ఞ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలకు వివిధ గ్రామాల భక్తు లు తరలివచ్చి అమ్మవారి కుంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శిం కున్నారు.
అనంతరం మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు, సోమవారం 27 న మహిళల చేత సామూహిక కుంకుమార్చన, కలశ ఊరే గింపు క 28న మంగళవారం కుంభోత్సవ కార్యక్రమం పురందరులచే విశేష కార్యక్రమం చేపట్టేందుకు దేవాంగ సమాజం సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
వేడుకలకు దేవాంగ సమాజం సభ్యులతో పాటు గ్రామస్తు లు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవా రికి కృపాకటాక్షములకు పాత్రులు కావాలని జాజా పూర్ దేవాంగ సమాజం సభ్యులు కోరారు.









