Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Breaking : మిర్యాలగూడలో వృద్ధురాలిపై దాడి.. బంగారం చోరీ.. సిసి టీవీ వీడియో..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలిపై ఇంట్లో ఉండగా దాడి చేసి బంగారం చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్పగూడెంలో జరిగింది. ఈ ఘటన సమీపంలో ఉన్న సిసి కెమెరా లో కూడా రికార్డ్ అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

Breaking : మిర్యాలగూడలో వృద్ధురాలిపై దాడి.. బంగారం చోరీ.. సిసి టీవీ వీడియో..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలిపై ఇంట్లో ఉండగా దాడి చేసి బంగారం చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్పగూడెంలో జరిగింది. ఈ ఘటన సమీపంలో ఉన్న సిసి కెమెరా లో కూడా రికార్డ్ అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన బైసాని లక్ష్మమ్మ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి గొలుసు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో లక్ష్మమ్మకు గాయాలయ్యాయి. సమీపంలోని ఒక వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుల వెళ్తున్న వీడియో రికార్డు అయింది.

సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించినట్లుగా, బంగారం దొంగతనానికి సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్మారు. వారు ఒక బైక్‌పై వచ్చారు. ఆ సమయంలో ఒక వ్యక్తి రెడ్ టీషర్ట్ ధరించి, పల్సర్ 150 బైక్‌పై వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు