Narayanpet : నారాయణపేటలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ..!
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జిల్లా కేంద్రంలో శనివారం డ్రగ్ అవేర్నెస్ ర్యాలీని విజయ వంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం నుండి సావర్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు.

Narayanpet : నారాయణపేటలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జిల్లా కేంద్రంలో శనివారం డ్రగ్ అవేర్నెస్ ర్యాలీని విజయ వంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం నుండి సావర్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు.
ఈ ర్యాలీ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి, యువత, విద్యార్థులు సాధారణ ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండండి అనే సందేశంతో పాల్గొన్నవారు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
మాదకద్రవ్యాల నివారణ, ముందస్తు గుర్తింపు,కౌన్సెలింగ్ సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో డ్రగ్ వ్యసనంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ , క్షేత్రస్థాయి అధికారి సాయి, డీడబ్ల్యుఓ విభాగంలోని అన్ని విభాగాల సిబ్బంది, వైద్య శాఖకు చెందిన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే వాటికి దూరంగా ఉండాలి..!
- Narayanpet : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. 30 పోలీస్ యాక్ట్ అమలు..!
- Miryalaguda : మిర్యాలగూడలో ఉచిత వాలీబాల్, హ్యాండ్ బాల్ శిక్షణా శిబిరం ప్రారంభం..!
- లోయలో పడ్డ గొర్రెల బొలెరో.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!