Delhi : ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది మృతి..!
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Delhi : ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేక్ విహార్ లోని ఓ భవనంలో రెండవ అంతస్తులో ఇంట్లో అమర్చిన ఏసి ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి.
ఆ మంటలు క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చి ఇంటిని అలుముకున్నాయి. ఆ ఇంట్లో ఉన్నవారు బయటకు రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి. దాంతో ఇంట్లో ఉన్న తొమ్మిది మంది బయటికి రాలేక అహుతయ్యారు. ఈ ఘటనలో 9 మంది చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజన్లతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాంతో అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









