Miryalaguda : ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి..!
ట్రాక్టర్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు సమీపంలో చోటుచేసుకుంది.

Miryalaguda : ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ట్రాక్టర్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం పలుగుతండ గ్రామానికి చెందిన పానుగోతు లాలు మిర్యాలగూడలోని మద్రాస్ ఫిల్టర్ కాపీ లో వాచ్మెన్ గా పనిచేస్తుంటాడు. గ్రామస్తులతో కలిసి వివాహ రిసెప్షన్ కు వెళ్తుండగా ట్రాక్టర్ పై పనుగోతు లాలు, దస్లీ, శ్రీను అనువారు గ్రామస్తులతో డాక్టర్ ఇంజన్ పై కూర్చుని వెళుతున్నారు.
మార్గమధ్యలో తుంగపాడు దాటిన తర్వాత రామన్నగూడెం సమీపంలో మూలమలుపు వద్ద ట్రాక్టర్ పైనుంచి పానుగోతు లాలు, ధనావత్ దస్లీ ట్రాక్టర్ పైనుంచి కింద పడ్డారు. కాగా లాలూ పైనుంచి డాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దస్లీకి నడుము పై గాయాలు అయ్యాయి. మృతుడి కుమారుడు పానుగోతు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









