Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బయట పిల్లలు లేని జిల్లాగా మార్చుదాం..! 

నారాయణ పేట జిల్లాను బడి బయట (డ్రాఫ్ అవుట్) పిల్లలు లేని జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బయట పిల్లలు లేని జిల్లాగా మార్చుదాం..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణ పేట జిల్లాను బడి బయట (డ్రాఫ్ అవుట్) పిల్లలు లేని జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాల ల బలోపేతానికి అందరం బాధ్యత తీసుకుందాం అని ఆమె సూచించారు.

జిల్లాలో ని ఏ ఒక్క గ్రామంలో కూడా బడి బయట పిల్లలు ఉండరా దని, బడి ఈడు పిల్లలు బడి లోనే ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రానికి సమీపం లోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో నారాయణ పేట నియోజక వర్గం, కొడంగ ల్ పార్ట్ సర్పంచులు, కౌన్సిల ర్ల కు విద్యాశాఖ లో అమల వుతున్న కార్యక్రమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈ నెల 11 నుంచి విద్యా శాఖా వారోత్సవాలు నిర్వహిస్తోందని, ఇటీవలే ఎల్. బీ స్టేడియం లో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వ ర్యంలో కార్యక్రమం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ వారోత్సవాలలో భాగంగానే మన జిల్లాలో సర్పంచులు, కౌన్సిలర్ల కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆమె తెలి పారు.

గ్రామ స్థాయిలో సర్పంచుల భూమిక ముఖ్యమని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు తమ తమ గ్రామానికి ఏం
అవసరమో ఈపాటికే తెలిసి ఉంటుందన్నారు. గ్రామాల లో ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి కూడా కొంత అవగా హన వచ్చి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామ లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల ద్వారా ఏం పథకాలు వస్తున్నాయి?. అవి ఎంత వరకు అమలు అవుతున్నాయని?. అందులో మన పాత్ర ఏమిటని సర్పంచులు, కౌన్సిలర్లు అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమానికి వచ్చిన సర్పంచులలో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఒక మహిళగా తనకు ఎంతో ఆనందం గా ఉందని అందరి కీ అభినందనలు తెలిపారు. గ్రామాల్లో పాఠశాలలను బాగు చేయాలంటే ప్రతీ విద్యార్థి పాఠశాలలోనే ఉండాలన్నారు.

అందుకు సర్పంచులు సహకారం ఎంతో అవసరం అన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఉండే బడి ఈడు పిల్లలంద రూ బడిలోనే ఉండాలని, డ్రాప్ అవుట్ జీరో ఉండాలని, అందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం జిల్లాలో డ్రాప్ డ్రాప్ అవుట్ పిల్లల జాబితా, ఎంత మంది పిల్లలు బడికి వెళ్తున్నారు.? ఇంకా ఎంత మంది పాఠశాల కు వెళ్లకుండా ఉన్నారనే వివరాలను నివేదికను విద్యా శాఖ తయారు చేస్తోందని ఆమె చెప్పారు.

ఏ గ్రామంలో అయితే వంద శాతం పిల్లలు బడికి వెళ్తున్నారో ! వారిని బడికి వెళ్లేలా చేసిన సర్పం చులకు ప్రభుత్వం ద్వారా సన్మానం చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా సర్పంచులు తమ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రతీ వారం సందర్శించాలని, పాఠశాలల్లోనే విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేయా లని అలా చేస్తే వంట ఏజెన్సీ నిర్వాహకులకు కొంత భయం ఉంటుందని, నాణ్యతా ప్రమాణాలు పాటించడం జరుగుతుందనీ ఆమె తెలి పారు.

అన్నీ అధికారులే చేయలేరని, కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు త్రీ లేయర్స్ ఉంటాయని, గ్రామ స్థాయిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని ఆమె తెలిపారు. గ్రామాలలో అంగన్ వాడిలు, పాఠశాలల సమస్యల పట్ల తన వద్దకు వస్తే అవసరమై నవన్ని సమకూర్చేందుకు సిద్ధంగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

ఈ కార్య క్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు, స్థానిక పురపాలిక చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాద వ్, వైస్ చైర్ పర్సన్ మంజుల మద్దూరు పుర చైర్ పర్సన్ సరస్వతి, ఆయా మండలాల ఎంఈవో లు, గ్రామాల సర్పం చులు, సెక్టోరియల్ అధికా రులు రాజేందర్ కుమార్, నాగార్జున రెడ్డి, విద్యాసాగ ర్, డీపీ ఆర్వో రషీద్, తపస్ నాయకులు షేర్ కృష్ణా రెడ్డి, నర్సింహ, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్ రెడ్డి, విద్యా శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు