Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక దాడులు..! 

నల్లగొండ జిల్లాలో వేసవి కాలంలో ఐస్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్. శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Nalgonda : నల్గొండలో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక దాడులు..! 

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లాలో వేసవి కాలంలో ఐస్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్. శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులు, ఆహార భద్రత ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు.
తనిఖీల్లో పలు యూనిట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం–2006 ప్రకారం అవసరమైన ఆహార లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఐస్‌ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా, చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉండేందున ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెప్పారు. అలాగే “బాహ్య వినియోగం కోసం మాత్రమే” అనే బోర్డులు ప్రదర్శించకపోవడం, ఆర్వో ప్లాంట్లలో యూవీ ట్రీట్‌మెంట్ వ్యవస్థ లేకపోవడం, ఆర్వో నీటి నిర్వహణ రిజిస్టర్లు, ఐస్ సరఫరా వివరాలు, ఉత్పత్తి రికార్డులు నిర్వహించకపోవడం గుర్తించారు.

నీటి నాణ్యత పరీక్ష నివేదికలు, మైక్రోబయోలాజికల్ టెస్ట్ రిపోర్టులు కూడా చూపించలేకపోయినట్లు తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం–2006 ప్రకారం నిర్దిష్ట కాల వ్యవధిలో మైక్రోబయోలాజికల్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఐస్ బార్‌ల లోడింగ్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ ప్లాట్‌ ఫారమ్‌లు లేకపోవడం వల్ల కలుషితమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

యూనిట్ నిర్వాహకులకు పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం, నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందడం, అవసరమైన రికార్డులు నిర్వహించడం పై ఆహార భద్రత అధికారి అవగాహన కల్పించారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదే సందర్భంగా ప్రకాశం బజార్‌లోని సఫా చికెన్ సెంటర్ నుండి ఈచూరి గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్‌ను అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. అనంతరం అది ఫంక్షన్ హాల్‌కు తరలిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలివేశారు. ఇకముందు ఫుడ్ లైసెన్స్ మరియు సంబంధిత పత్రాలతోనే మాంసం రవాణా చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు