Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో అనుమానస్పద స్థితిలో యువకుని మృతి..!

కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో అనుమానస్పద స్థితిలో యువకుని మృతి..!

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ

కోదాడ, మనసాక్షి :

కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ గా గుర్తించడం జరిగింది.

యువకుని హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పి నరసింహ, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి తో కలిసి పరిశీలించారు. మృతుని యొక్క వివరాలను స్థానికులను, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హత్య గల కారణాలను ఛేదించి నేరానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి తెలిపారు . ఘటన స్థలంలో క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం, డాగ్ స్క్వాడ్ టీం సిబ్బంది ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసు ఛేదించి నేరస్థులను పట్టుకుంటాం అని ఎస్పి తెలిపారు.

ఎస్పి వెంట కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్ఐ లు నవీన్, పరమేష్, గోపాల్, క్లూస్ టీమ్ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు