Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సందర్శించిన ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లో ప్లాంట్‌లోని యూనిట్-3లో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరగింది. కాగా సోమవారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన యూనిట్ సందర్శించారు.

Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సందర్శించిన ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లో ప్లాంట్‌లోని యూనిట్-3లో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరగింది. కాగా సోమవారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన యూనిట్ సందర్శించారు. ప్రమాదం జరిగిన పరిస్థితిని సమీక్షించారు.
ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నప్పటికీ, ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. అలాగే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియజేసారు. కంట్రోల్ రూమ్ కి వెళ్లి ప్రమాదం జరిగిన సీసీ టీవీ విజువల్స్ పరిశీలించారు. అతిత్వరలో నూతన కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు అమర్చి తిరిగి ప్రారంభింస్తామని తెలియజేసారు. ఆయన వెంట అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









