Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

TPCC : టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్‌ గా గుర్రం కోటేశ్వర్..! 

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రం కోటేష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

TPCC : టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్‌ గా గుర్రం కోటేశ్వర్..! 

కేతేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రం కోటేష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. నిరుపేద గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన గుర్రం కోటేష్ తెలంగాణ ఉద్యమం నుండి విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజా పోరాటాలలో కీలక పాత్ర పోషించాడు.

డా.పీడమర్తి రవన్న నాయకత్వంలో మాదిగ విద్యార్థి జేఏసీ నాయకుడిగా దళిత విద్యార్థుల సమస్యలపై పోరాడి ప్రత్యేక గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సేవలు అందిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గుర్రం కోటేష్ నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు