District collector : చేనేత మగ్గాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
నారాయణ పేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ వీధిలో గల చేనేత సహకార సంఘం (లిమిటెడ్ ) కార్యాలయంలో చేనేతే మగ్గాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు.

District collector : చేనేత మగ్గాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
నారాయణ పేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ వీధిలో గల చేనేత సహకార సంఘం (లిమిటెడ్ ) కార్యాలయంలో చేనేతే మగ్గాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులు ఏ విధంగా మగ్గాలను నేస్తున్నారు ? వారికి రోజువారీ కూలీ ఎంత చెల్లిస్తున్నారని చేనేత జౌళి శాఖ అధికారి బాబును అడిగి తెలుసుకున్నారు. మగ్గం పై ఓ చేనేత కార్మికురాలు నేస్తున్న కాటన్ చీరను ఆమె పరిశీలించారు. చేనేత కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సంఘాలకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ద్వారా ఏ ఏ పథకాలు అమలు జరుగుతున్నాయని ఏ డీ ని ప్రశ్నించగా నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా, క్లస్టర్ డెవలప్మెంట్ స్కీములు, క్యాష్ క్రెడిట్, వ్యక్తిగత రుణాల మాఫీ చేనేత కార్మికులకు వర్తిస్తుందని ఏ డీ బాబు కలెక్టర్ కు వివరించారు. నేత కార్మికులు చేతితో నేసిన నారాయణపేట కాటన్ చీరను జిల్లా కలెక్టర్ కొనుగోలు చేశారు.










