Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Nalgonda : రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..!

నల్లగొండ, మనసాక్షి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  నల్గొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సాధారణ సమావేశం శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీలు ఎంతో కృషి చేశాయని అన్నారు.రైతుల సమస్యలపై మార్కెట్ కమిటీ పాలకవర్గాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు.

నల్గొండ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా పనిచేయడం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు పూర్తికావచ్చాయని పేర్కొన్నారు.

నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కనగల్ సబ్ మార్కెట్ యార్డులో రూ. 1.25 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ నిధుల ద్వారా గ్రామీణ, మండల ప్రాంతాలకు లింకు రోడ్డు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీ నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను నిలిపివేసిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.
తొలిసారిగా మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనాథ రాజు, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాడల జానయ్య,గంటకంపు సైదులు, ఆంజనేయులు, సుంకిరెడ్డి సైదిరెడ్డి, చిట్టిపోలు నాగయ్య,కుక్కడపు శ్రీను, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు