Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ లో 50 రోజులకు చేరుకున్న ఉచిత పెరుగన్నం పంపిణి..!

మిర్యాలగూడ పట్టణంలో బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 వేల మందికి పంపిణీ చేసే ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 50 వ రోజు కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి విచ్చేసి అందరికీ పెనుగన్నాన్ని పెట్టడం జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడ లో 50 రోజులకు చేరుకున్న ఉచిత పెరుగన్నం పంపిణి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 వేల మందికి పంపిణీ చేసే ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 50 వ రోజు కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కౌన్సిలర్
దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి విచ్చేసి అందరికీ పెనుగన్నాన్ని పెట్టడం జరిగింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మూడు నియోజకవర్గాల నుండి కొన్ని వేల మంది రైతులు, కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ప్రతిరోజు వస్తూపోతూ ఉంటారని.. వారు ఎండాకాలం ఈ ఎండ వేడిమిని తట్టుకోవటానికి మన శాసనసభ్యులు బిఎల్ఆర్ మిర్యాలగూడ పట్టణంలో 10 చోట్ల చలివేంద్రాలని ఏర్పాటు చేశారాన్నారు.

అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్స్ లో, ఏరియా హాస్పిటల్ లో పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక పెద్దన్నలా ఉంటూ ఎవరికి ఏ బాధ వచ్చినా దాన్ని వారే భరిస్తూ ఎప్పుడు ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే నినాదంతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి మనకు శాసనసభ్యులు గా రావటం అనేది మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు.

వారు ఎప్పుడూ సేవా దృక్పథంతోనే ఉంటూ అన్నా అంటే నేనున్నా అంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి తోచిన సాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి వారిని వారు నిరంతరం ప్రజా సంక్షేమమే వారి విధిగా భావిస్తూ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు బెదిరింపులకు భయపడకుండా.. ప్రజలు నన్ను నమ్మి ఓటు వేశారు.. వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నవారని అన్నారు.

హైదరాబాదులో క్వార్టర్స్ తీసుకోకుండా మిర్యాలగూడ లోనే ఉంటూ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యేకి మనమెప్పుడూ రుణపడి ఉంటామని, అందరం కూడా ఆయన బాటలోనే నడుస్తూ నిరంతరం ప్రజలకు ఎవరికి తోచిన సాయాన్ని వారు చేస్తూ ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దేశిడీ శేఖర్ రెడ్డి, తాళ్ల వెంకటరెడ్డి, అజయ్, లవ కుమార్, గుంటూరు శేఖర్, గార్లపాటి వెంకట్ రెడ్డి, బాలకృష్ణ, దైద శ్యాంసుందర్ రెడ్డి, కొండల్, గౌస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు