Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsవ్యవసాయం

రాయితీ పై వేరుశనగ విత్తనాలు.. రైతుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..! 

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని రైతులు కోసం ఖరీఫ్ సీజన్ లో రాయితీపై వేరుశనగ విత్తనాలు అందజేయనున్నట్లు ఏవో జాఫర్ తెలిపారు.

రాయితీ పై వేరుశనగ విత్తనాలు.. రైతుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..! 

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని రైతులు కోసం ఖరీఫ్ సీజన్ లో రాయితీపై వేరుశనగ విత్తనాలు అందజేయనున్నట్లు ఏవో జాఫర్ తెలిపారు. అందుకుగాను రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ విత్తనాలు రామ సముద్రం మండలంకు కె 6 రకం 500 క్వింటాళ్లు, టీసీజీ ఎస్ 1694 రకం 560 క్వింటాళ్లు, మొత్తం 1060 క్వింటాళ్లు కేటాయించడం జరిగిందని ఏ వో జాఫర్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో సంబంధించిన రైతు సేవా కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకొవాలని వేరుశనగ విత్తనం 30 కేజీల బస్తా పూర్తి ధర 3060. 40% సబ్సిడీ పోను 1836 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు