Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Breaking News : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి..!

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చింతపల్లి మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Breaking News : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి..!

చింతపల్లి, మన సాక్షి :

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చింతపల్లి మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  తెలిసినవారు చెప్పిన ప్రకారం చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కొంగల రాము (36) ఉన్నాడు.

రోజువారి కూలి గా మేస్త్రిగా పనిచేస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో పని పూర్తి చేసుకుని తిరిగి తన మోటార్ బైక్ పై చింతపల్లి మండల కేంద్రానికి వెళ్తున్న సందర్భంగా మండల పరిధిలోని విరాట్ నగర్ గ్రామ సమీపంలో మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం మోటార్ బైకును బలంగా ఢీ కొట్టి వ్యక్తిపై ఆ వాహనం వెళ్లడంతో కొంగల రాము అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న విరాట్ నగర్ కాలనీవాసులు వెంటనే చింతపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నట్లు సమాచారం. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు