Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : అమీర్ పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, పొగ..!

హైదరాబాదులోని అమీర్పేట లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్ వెస్ట్ లో మెట్రో పిల్లర్ నెంబర్ A1043 సమీపంలో ఉన్న ఫ్యాషన్స్ దుకాణంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి.

Hyderabad : అమీర్ పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, పొగ..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాదులోని అమీర్పేట లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్ వెస్ట్ లో మెట్రో పిల్లర్ నెంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్ దుకాణంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. దాంతో స్థానికంగా ఉన్నవారు భయాందోళనలకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

వేగవంతంగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కారణంగా పరిసర ప్రాంతాలు మొత్తం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భవనంలో మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్గి ప్రమాదం సందర్భంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందనే విషయం అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు