Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావిద్య

Text Books Seized : అక్రమంగా నిల్వ చేసిన ప్రైవేట్పా పాఠశాల పాఠ్య పుస్తకాలు సీజ్..!

గోదావరిఖని నగరంలోని సప్తరి కాలనీలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాల గదిని విద్యా శాఖ సీజ్ చేశారు.

Text Books Seized : అక్రమంగా నిల్వ చేసిన ప్రైవేట్పా పాఠశాల పాఠ్య పుస్తకాలు సీజ్..!

గోదావరిఖని, మనసాక్షి :

గోదావరిఖని నగరంలోని సప్తరి కాలనీలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాల గదిని విద్యా శాఖ సీజ్ చేశారు. సప్తవరి కాలనీ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి అమ్మడానికి సిద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారంతో విద్యార్థి, యువజన సంఘాలు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పాఠ్యపుస్తకాలను నిల్వ చేసిన గది సమాచారం సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.

రామగుండం ఎంఈఓ జింక మల్లేశం ఆదేశాల మేరకు సిఆర్పి వచ్చి తనిఖీ చేసి గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు బి దుర్గాప్రసాద్, కే సాగర్, బి ప్రసన్న, బి వంశీకృష్ణ, మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఎవ్వరు పుస్తకాలు ముద్రించి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిబంధనల ప్రకారం ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ముద్రించిన పాఠ్యపుస్తకాల ద్వారానే పాఠాలు చెప్పాలని నిబంధన ఉన్నప్పటికీ అవి ఏమీ మాకు వర్తించవనే విధంగా ప్రైవేటు పాఠశాలలు వారి విద్యాసంస్థలు ముద్రించిన పాఠ్యపుస్తకాలనే అధిక ధరలకు అమ్ముతూ తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా తీవ్ర నష్టం కలిగించే విధంగా చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ పాఠ్యపుస్తకాలు ముద్రించి ఆమ్మిన ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు