జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…!
నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలోని ఇనుపాముల గ్రామ పరిధిలో జాతీయ రహదారి 65 పైన కారు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు.

జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…!
కేతేపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలోని ఇనుపాముల గ్రామ పరిధిలో జాతీయ రహదారి 65 పైన కారు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. వివరాలు ఎలా ఉన్నాయి. మృతుడైన ఆవ్వారా సత్యనారాయణ ( 48 ) గ్రామం, మండలం మునుగోడు లో తన సొంత అన్న అయిన చంద్రశేఖర్ దగ్గర టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని ఆయన తెలిపారు.
మృతుడికి వివాహము కాలేదని, మృతుడికి మొక్కలను పెంచడంలో ఆసక్తి ఎక్కువగా ఉన్నందున అక్కడ నర్సరీలో ఉన్న కొత్త కొత్త మొక్కల కోసం తిరుగుతూ కొనుగోలు చేసి ఇంట్లో పెంచుతుంటాడని ఆయన తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రాంతంలో తన ఇంటి నుంచి నకరికల్లు వచ్చి, అక్కడి నుండి కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ పరిధిలో ని ఎన్ హెచ్ 65 రోడ్డు పక్కన ఉన్న శ్రీ లక్ష్మీ సాయి నర్సరీ దగ్గరికి వెళ్లి, అట్టి నర్సరీ ముందు నుండి, హైదరాబాద్ వైపు వెళ్ళు రోడ్డు వైపు నుండి విజయవాడ రోడ్డు వైపు కు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ 39 ఆర్ వై 5347 నెంబర్ గల కార్ డ్రైవర్ తన కారును అతివేగంగా అజాగ్రత్తగా నడిపి మృతుడిని ఢీకొట్టగా మృతుడు ఒక్కసారిగా ఎగిరి రోడ్డు మీద పడుట వలన తలకు, ఇతర చోట్ల తీవ్రమైన రక్త గాయాలై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందినాడని ఆయన వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.









