Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : పేట జిల్లాలో భారీగా బయోమాస్ స్టాక్ దగ్దం..!
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Suryapet : పేట జిల్లాలో భారీగా బయోమాస్ స్టాక్ దగ్దం..!
మేళ్లచెరువు, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామ శివారు లోని పెద్ద కాలువ సమీపంలో నిల్వ చేసిన బయోమాస్ స్టాక్ కోసం నిల్వ చేసిన పత్తికట్టల కుప్పకు నిప్పు అంటుకోవడంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. సుమారు ఐదు ఎకరాల్లో ఈ బయోమాస్ స్టాక్ ను రైతుల నుండి ఓ ప్రైవేటు కంపెనీ సేకరించి నిల్వ చేసింది. పొలిమేరల్లోని వ్యవసాయ పొలాల్లో నిల్వ చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. మంటలను ఆర్పేందుకు పోలీసు, అగ్నిమాపక అధికారులు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.









