Shankarpally : టిప్పర్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి..!
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Shankarpally : టిప్పర్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ మీర్ ముదసర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి దగ్గర ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వృద్ధుడు (80) రోడ్డు దాటుతుండగా TS 05 UF 1167 నెంబర్ గల అశోక్ లీలాండ్ టిప్పర్ లారీ వృద్ధుడిని బలంగా ఢీకొట్టడం వల్ల తలకు తీవ్ర రక్తస్రావమై స్పృహ లేని స్థితిలో పడిపోయాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు గాయపడ్డ వృద్ధుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎటువంటి ఆధారాలు లభించలేవని, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్ లో ఈ (8712663465) నెంబర్ కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.









