Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
District Collector : ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ..!
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు.

District Collector : ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 26 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను,లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









