Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్.. రెండేళ్లు సీఎంగా నేనేం చేశాను చర్చకు సిద్ధం..!

హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.సోమవారం ఖానామెట్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనంతో పాటు మియాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్.. రెండేళ్లు సీఎంగా నేనేం చేశాను చర్చకు సిద్ధం..!

శేరిలింగంపల్లి, మన సాక్షి

హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఖానామెట్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనంతో పాటు మియాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

మొత్తం రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డిమంత్రి శ్రీధర్ బాబు, రాజ్య సభ సభ్యులు వేం.నరేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మల్ రెడ్డి , నవీన్ యాదవ్ చైర్మన్ లు జేరిపేటి జైపాల్, బండి రమేష్, రఘునాథ్ యాదవ్, తాజా మాజీ కార్పొరేటర్లు, సీఎంసీ కమిషనర్ సృజన , జోనల్ కమిషనర్లు నారాయణ్ అమిత్ మాలెంపాటి, మయాంక్ సింగ్, పోలీస్ కమిషనర్ డా. రమేష్ రెడ్డి అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం మియాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒకే నగరంగా ఉన్నప్పుడు పరిపాలనా పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే హైదరాబాద్ పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా స్పష్టమైన సరిహద్దులతో కార్పొరేషన్లను రూపొందించామని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేషన్ కార్యాలయం భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. మియాపూర్‌లో ద్విముఖ వంతెన, రెండు అండర్‌పాస్‌లు, మియాపూర్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు ఐదు వరుసల ద్విముఖ పైవంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తగ్గించేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందామని, రెండేళ్లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. సైబరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయని, దేశ ఐటీ ఎగుమతుల్లో 16.77 శాతం హైదరాబాద్‌ నుంచే వెళ్తున్నాయని చెప్పారు.

‘‘దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాలుష్యం వల్ల దిల్లీలో స్కూళ్లు, ప్రధాని కార్యాలయాన్నే మూసేశారు. మన హైదరాబాద్‌ నివాసానికి అనుకూలంగా ఉంది. పెద్ద నగరాలకు ఉన్న సమస్యలు హైదరాబాద్‌లో లేకుండా చూసేందుకు నిపుణులతో కమిటీ వేశాం. మంత్రి శ్రీధర్‌ బాబు నేతృత్వంలో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

తెలంగాణ నుంచి 8 మంది భాజపా ఎంపీలను పంపిస్తే మోదీ ప్రధాని అయ్యారు. మరి ఆ ఎంపీలు తెలంగాణకు ఏం తీసుకొచ్చారు. రెండేళ్లలో ఏం చేయలేదని నన్ను అంటున్నారు.. మరి మీరేం చేశారు నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుపుల్ల పెట్టారు. సబర్మతి, గంగా, యమున నదులను ప్రక్షాళన చేస్తే ఆహా ఓహో అన్నారు. మూసీ ప్రక్షాళనకు సహకరించమని భాజపా ఎంపీలు మోదీని అడిగారా12 ఏళ్లుగా మోదీ ఏం చేశారో? రెండేళ్లు సీఎంగా నేను ఏం చేశానో చర్చకు సిద్ధం.

గాజులరామారంలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రాయదుర్గం టు నియోపొలిస్. రాయదుర్గం నుంచి నియోపొలిస్ వరకు మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే లక్ష లైట్ , మిగతా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పేదలు కూడా నగర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా వారికి ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.

ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విడిపించుకుని భవిష్యత్తు అభివృద్ధి అవసరాలకు వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తున్నామని తెలిపారు.పదేళ్ల కేసీఆర్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఏం లభించిందనే అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం సవాల్ విసిరారు.

గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయకపోయి ఉంటే నేడు హైదరాబాద్ స్థాయికి చేరుకునేది కాదన్నారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం, పేదలకు ఇళ్లు, మెరుగైన విద్య, వైద్య సేవల కల్పన ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. రాబోయే 24 నెలల పాటు రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్రంలోని అన్ని కీలక అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.

మరిన్ని వార్తలు