Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : జిల్లా ఎస్పీ యువతకు పిలుపు.. ఉజ్వల భవిష్యత్తుకు వాటికి దూరంగా ఉండాలి..!

గంజాయి, మాదకద్రవ్యాల పైన సమాచారం నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని, యువత కష్టపడి చదువుకోని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని సూర్యాపేట ఎస్పీ కే నరసింహ కోరారు.

Suryapet : జిల్లా ఎస్పీ యువతకు పిలుపు.. ఉజ్వల భవిష్యత్తుకు వాటికి దూరంగా ఉండాలి..!

సూర్యాపేట,  మనసాక్షి.

గంజాయి, మాదకద్రవ్యాల పైన సమాచారం నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని, యువత కష్టపడి చదువుకోని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని సూర్యాపేట ఎస్పీ కే నరసింహ కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పట్ల విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన సమాజం నుండి డ్రగ్స్ ను తరిమివేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని దీనికోసం సంబంధిత ప్రభుత్వ అధికారులు, జిల్లా పోలీస్, జిల్లా యంత్రాంగం అనుక్షణం పని చేస్తుందని అన్నారు.

యువత, విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు సాధన చేయాలని కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడొద్దను , చెడుకు దూరంగా ఉండాలని , మంచి స్నేహితులను, మంచి పుస్తకాలను ఎంచుకోవాలన్నారు. తల్లి దండ్రులకు, చదువు నేర్పు గురువులకు మంచి పేరు తేవాలని సమాజానికి, ప్రజలకు మంచి సేవ చేసే వనరుగా ఎదగాలి అని అన్నారు.మహిళలు, బాలలు, విద్యార్థుల రక్షణలో అనుక్షణం పని చేస్తున్నాము అన్నారు.

గంజాయి లేదా ఇతర వ్యసనాలకు బానిసలైన వారు ఎవరైనా ఉంటే, వారిని గుర్తించి సంరక్షణ (పునరావాస) కేంద్రాలకు తరలించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అందరూ కృషి చేయాలి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనకు అనుక్షణం పనిచేస్తోందని, నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సంబంధిత కేసుల్లో ఉన్న పాత నేరస్థులపై నిఘా ఉంచి, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రూపు మాపడంలో యువతరం ముందుండాలని, సమాజ మార్పు కోసం పోలీసులతో చేతులు కలపాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

డ్రగ్స్ , గంజాయి నిర్మూలనలో తమ వంతు భాగస్వాములం అవుతాము, గంజాయి అలవాటు ఉన్నవారిలో పరివర్తన తెస్తాం అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయుంచారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేష్, కనకరాత్నం, బరోసా ఎస్ఐ మౌనిక, షీ టీం ఎస్సై నీలిమ, పోలీసు సిబ్బంది కళాశాల యాజమాన్యం డా. రామకృష్ణ, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు