Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర సంఘటన.. భూమి గట్ల విషయంలో తగాదా, రాళ్లతో కొట్టి చంపారు..!

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటి గడ్డ తండా లో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర సంఘటన.. భూమి గట్ల విషయంలో తగాదా, రాళ్లతో కొట్టి చంపారు..!

చింతపల్లి, మనసాక్షి :

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటి గడ్డ తండా లో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది.

గ్రామస్తుల వివరాల ప్రకారం చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండా కు చెందిన నేనావత్ రవీందర్ నాయక్, వారి పాలివారైనా నేనావత్ రాజేందర్ నాయక్, నేనావత్ రవి నాయకులకు తక్కలపల్లి గ్రామ సమీపంలో మూడు ఎకరాల భూమి కలిగి ఉంది.గతంలో పంచుకొని ఎవరి భూమి వారు చేసుకుంటున్నారు.

ఆదివారం మధ్యాహ్నం వారికి కలిగి ఉన్న భూమిలో గెట్టు పంచాయతీ విషయమై ఇరువురు గల మధ్య ఘర్షణ తలెత్తింది, దీంతో మాట.. మాట పెరిగి కట్టెలతో కొట్టుకోవడంతోపాటు, ఒకరిపై ఒకరు రాళ్లు కూడా విసురుకున్నారు. ఈ విషయ గ్రామస్తులకు తెలియగా వెంటనే సంఘటన స్థలానికి గ్రామస్తులు కొందరు ఘర్షణ వారించేందుకు చేరుకున్నారు.

అప్పటికే నేనావత్ రవీందర్ నాయక్ కు తలకు ఒంటిపై బలమైన గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయాల పాలైన రవీందర్ నాయకును చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గంలోని మృతి చెందినట్లు గ్రామస్తులు బంధువులు పేర్కొన్నారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ పడి నేనవత్ రవీందర్ నాయకును కొట్టి చంపిన వ్యక్తులు పరారీలో ఉన్నారు.. మృతుని భార్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు