Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..!

వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి ఎచ్ ప్రియాంక సూచించారు. సోమవారం జిల్లా కోఆర్డినే షన్ కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి ఎచ్ ప్రియాంక సూచించారు.
సోమవారం జిల్లా కోఆర్డినే షన్ కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలు మరియు టైఫాయిడ్ మొదలగు వ్యాధుల నియంత్రణ చర్య లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. జయ చంద్ర మోహన్ మాట్లాడుతూ తీసుకునే చర్యల గురించి జిల్లా అధికారులకు వివరించారు.

ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీకాంత్ కార్యక్రమం వివరాలు మొత్తం పి.పి.టి. ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నిరంతరంగా డ్రైడే ఆక్టివిటీస్ నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

అన్ని శాఖల సమన్వయంతో గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ సర్వీలెన్స్ నిర్వహించాలని శానిటేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా ర్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమా లు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ సమన్వయ కమిటీ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు