Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచనలు.. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నిర్మాణ పనులు పరిశీలన..!
నారాయణ పేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐ డి ఓ సి ) పనులను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచనలు.. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నిర్మాణ పనులు పరిశీలన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
నారాయణ పేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐ డి ఓ సి ) పనులను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు.
ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి
భవనం మొత్తం తిరిగి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిల్డింగ్ లోని కలెక్టర్ ఛాంబర్, మీటింగ్ హాల్, అదనపు కలెక్టర్, ఏ వో చాంబర్లను పరిశీలించారు. బిల్డింగ్ లోపల చాంబర్ల కు కిటికీలు, తలుపులను వెంటనే బిగించాలని, వైరింగ్, శానిటరీ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలన్నారు. మీటింగ్ హాల్ లో ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, మీటింగ్ హాల్ కలరింగ్ కోసం ఇతర జిల్లాలలోని కలెక్టరేట్ భవనాలలో ఆయా మీటింగ్ హాల్స్, కలెక్టర్ ఛాంబర్ ల డిజైన్ల ను చూసి, అలాంటి వాటినే ఇక్కడ డిజైన్ చేయాలని ఆదేశించారు.
అంతలోపు వుడెన్ వర్క్ ప్రారంభించాలన్నారు. అలాగే భవనం వెనుకభాగంలో దారిని ఏర్పాటు చేసి గేటును అమర్చాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. బిల్డింగ్ బయట ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి కుదరదని, హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు తెలపగా, ఆ స్థలాన్నీ వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని, పార్కింగ్ షెడ్డు పై మహిళా సంఘాల సభ్యుల సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు గురించి అధికారులతో ఆమె చర్చించారు.
అనంతరం కలెక్టర్ బంగ్లా వెనుక భాగంలో 2 ఎకరాలలో స్థలంలో 5 కోట్ల తో కొనసాగుతున్న ఇందిరా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆ భవనంలోని మీటింగ్ హాల్, ఇతర గదులను చూశారు. భవనం బయట స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అవకాశం ఉంటే చూడాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు.
భవన ఆవరణలో ఒక వైపు రహదారిని ఏర్పాటు చేసి, మిగతా స్థలంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని డీ ఆర్డీ ఓ వెంకట్ రాములు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈ ఈ వెంకట రమణ, డీ ఈ రాములు, పీ ఆర్ ఈ ఈ అశోక్ కుమార్, ఆయా శాఖల ఏ ఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.










