Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దితెలంగాణరాజకీయం

 CM Revanth Reddy : నల్గొండ జిల్లా కనగల్ లో “పైలాన్” ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..! 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.13 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్ల పైలాన్ ను ఆదివారం కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

CM Revanth Reddy : నల్గొండ జిల్లా కనగల్ లో “పైలాన్” ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..! 

కనగల్, మనసాక్షి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.13 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్ల పైలాన్ ను ఆదివారం కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హెలికాప్టర్లో సాయంత్రం గం. 3.45కు హైదరాబాదు నుంచి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్ లో పైలాన్ వద్దకు చేరుకుని గం. 3.55కు పైలాన్ ను ఆవిష్కరించారు. పైలాన్ వద్ద కొద్దిసేపు గడిపిన ఆయన ప్రజలకు అభివాదం చేసి తిరిగి కారులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.

గం. 4.10కి హెలికాప్టర్లో నల్లగొండ లోని ఎన్జీ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఇది ఇలా ఉంటే పైలాన్ సీఎం ఆవిష్కరించడంతో రాష్ట్రవ్యాప్తంగా హ్యాం రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. పైలాన్ ఆవిష్కరణకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు పకడ్బందీగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ అండ్ బి శాఖ సెక్రెటరీ వికాస్ రాజ్, కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు