Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
తెలంగాణ ప్రభుత్వం సాగును ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జూన్ 30న) విడుదల చేయనున్నారు.

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం సాగును ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జూన్ 30న) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేయాలని భవిస్తున్నారు. అది కాకుంటే గతంలో మాదిరిగా 9 వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజులలో విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగానే ఈసారి కూడా అదే పద్ధతిలో జమ చేయాలని కూడా నిర్ణయించారు.
అయితే రైతు భరోసా నిధుల విడుదల కోసం మధిర లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్ణయించినప్పటికీ వర్షాల కారణంగా మధిర సభను రద్దు చేశారు. హైదరాబాదు వేదికగా శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి రైతు భరోసా కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జూన్ 15వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు గానే ప్రభుత్వం భావించింది. జూలై 5వ తేదీ వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి కూడా రైతు భరోసా నిధులు అందజేయాలని ప్రభుత్వం కీలకంగా నిర్ణయించింది.









