District Collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
సింగారం మలుపు దారి సమీపంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ , కాలేజీ బాలురు దామరాగిద్ద పాఠశాల ను కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆకస్మికంగా సందర్శించారు.

District Collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
పేద విద్యార్థులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. మంగళవారం సింగారం మలుపు దారి సమీపంలో గల
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ , కాలేజీ బాలురు దామరాగిద్ద పాఠశాల ను కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల్లో అదనంగా నిర్మించిన గదులను పరిశీలించారు.
పాఠశాల్లో ఇంకా అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ గోడ, కిటికీలు ఇంకా మౌలిక సదుపాయల పై అరతీశారు. ఇంటర్మీడియట్, ఎస్.ఎస్.సి విద్యార్థులతో మాట్లాడి, వారి భవిష్యత్ విజయాల కోసం కొన్ని సూచనలు చేశారు.
ఎస్.ఎస్.సి తరగతిలో గణితం తరగతిని విని, పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగారు తెలుసుకున్నారు. విద్యార్థుల ద్వారా వచ్చిన జవాబుల పై సంతృప్తి చెందారు. అనంతరం స్నానాల గది, భోజనశాల, వంటగదిని సందర్శించారు. పాఠశాలకు గదులు వసతుల పై అడిగి తెలుసుకున్నారు.









