Suryapet : సూర్యాపేట జిల్లాలో నాటు సారా తయారీ స్థావరంపై దాడులు..!
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని తమ్మారం గ్రామంలో నాటుసారా తయారీ స్తావురంపై పోలీసులు శనివారం ఉదయం రైడ్ చేశారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో నాటు సారా తయారీ స్థావరంపై దాడులు..!
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని తమ్మారం గ్రామంలో నాటుసారా తయారీ స్తావురంపై పోలీసులు శనివారం ఉదయం రైడ్ చేశారు. తమ్మారం గ్రామానికి చెందిన శేషం రామకృష్ణ అనే వ్యక్తి కృష్ణా నది ఒడ్డున ఉన్న బీడు భూమిలో నాటుసారా తయారు చేయడానికి సారా బట్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రాగా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది చింటపాలెం పోలీసులు దాడి చేసినట్లు ఎస్ఐ పరమెష్ తెలిపినారు.
ఈ దాడిలో సారా బట్టీ వద్ద 10 లీటర్ల బెల్లం పానకం, 2 లీటర్ల తయారు చేసిన నాటుసారాను గుర్తించడం జరిగినది. అనంతరం సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పానకాన్ని అక్కడే పారబోసి, సారా బట్టీ సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగినది. ఈ ఘటనపై చింతలపాలెం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే నాటుసారా, ఇతర నిషేధిత పదార్థాల తయారీ మరియు విక్రయాలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. మండలంలో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.









