Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు నలుగురు మృతి..!

నల్గొండ జిల్లా చిట్యాల 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Nalgonda : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు నలుగురు మృతి..!

చిట్యాల, మన సాక్షి :

​నల్గొండ జిల్లా చిట్యాల 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు కారులో విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. కారు పెద్దకాపర్తి శివారు ప్రాంతానికి చేరుకోగానే, వెనుక నుండి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ​ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై, కారులోనే శవమై తేలారు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
​ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో అత్యంత శ్రమతో బయటకు తీశారు.

మృతుల వద్ద లభించిన ఐడెంటిటీ కార్డులు, ఆధారాల ఆధారంగా వారు కాకినాడ వాసులుగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు