Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. సన్న వడ్ల బోనస్ పై ప్రభుత్వం స్పెషల్ గైడ్ లైన్స్..!
వానాకాలంలో తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యానికి అందజేసే బోనస్ పై స్పెషల్ గైడ్ లైన్స్ ను పెట్టింది. ప్రభుత్వం ఇప్పటికే ఏడు రకాల సన్నధాన్యం రైతులు పండించాలని, వాటికే ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్న విషయం తెలిసింది.

Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. సన్న వడ్ల బోనస్ పై ప్రభుత్వం స్పెషల్ గైడ్ లైన్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
వానాకాలంలో తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యానికి అందజేసే బోనస్ పై స్పెషల్ గైడ్ లైన్స్ ను పెట్టింది. ప్రభుత్వం ఇప్పటికే ఏడు రకాల సన్నధాన్యం రైతులు పండించాలని, వాటికే ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్న విషయం తెలిసింది. అంతే కాకుండా ఆ ఏడు రకాల వరి విత్తనాలనే విత్తన వ్యాపారులు, డీలర్లు విక్రయించాలని లేదా రైతు వేదికలలో వ్యవసాయ అధికారుల వద్ద రైతులు తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
రైతులు సన్నధాన్యం పేరుతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం రైతులను అలర్ట్ చేసింది. కేవలం ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నధాన్యాలు మాత్రమే రైతులు పండించాలని సూచించింది. ఆ సన్న ధాన్యాలు పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించనున్నారు.
అందుకు గాను ముందే పంటలు సాగు చేయకముందే రైతులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇది ఇలా ఉండగా రైతులు విత్తల వ్యాపారులు, డీలర్ల వద్ద కొనుగోలు చేసే సన్న రకాల విత్తనాలు వెంటనే ఆన్ లైన్ నమోదు చేయాల్సి ఉంది.
రైతు సన్న రకం దాన్యం విత్తనాలు కొనుగోలు చేసిన విషయాన్ని ప్రభుత్వానికి పారదర్శకంగా ఉండే విధంగా ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. రైతుల అందరి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయడం వల్ల సన్న రకం విత్తనాలు ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని వెంటనే తెలిసి పోయాలా ఆన్ లైన్ చేయాల్సి ఉంది. సన్న రకం విత్తనాలు కొనుగోలు చేసినట్లు ఆన్లైన్లో నమోదు ఉన్న రైతుల కు మాత్రమే పంటలు కొనుగోలు చేస్తే సమయంలో బోనస్ అందించే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో నమోదు :
విత్తన వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ ను ఇచ్చింది. రైతులకు విక్రయించే విత్తనాలను వెంటనే రైతు పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నెంబర్, డీలర్ వివరాలు కొనుగోలు చేసిన తేదీ, విత్తన ప్యాకెట్ పరిమాణం తో పాటు పూర్తి వివరాలనుతో ఆన్ లైన్ లో నమోదు చేయాలని పేర్కొన్నది. ఒకవేళ రైతులు తమ వద్ద ఉన్న గత పంటలో తయారు చేసుకున్న సన్న రకాల విత్తనాలనే తిరిగి నాటేందుకు సిద్ధమైతే ఆ వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. సన్నధాన్యం పండించే రైతుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు అయితేనే వానాకాలం పంటల అనంతరం ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం బోనస్ అందించే అవకాశాలు ఉన్నాయి.
ఆ ఏడు రకాల వరి విత్తనాలు ఇవే :
ఆర్ ఎన్ ఆర్ 15048, బిపిటి 5204, కె ఎన్ ఎం 1638, హెచ్ఎంటి సోన, జై శ్రీరామ్, డబ్ల్యూ జి ఎల్ 44, కె ఎన్ ఎం 7715 రకాలైన సన్న వాటికి ప్రభుత్వం బోనస్ అందించే అవకాశం ఉంది. వీటిని మాత్రమే రైతులు కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులు ఒకవేళ డీలర్ల వద్ద కొనుగోలు చేయకుంటే గత పంట కాలంలో సిద్ధం చేసుకున్న విత్తనాలను వేసుకుంటే నమోదు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి :
- Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!
- Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!
- రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.. ముందుకొచ్చిన చెన్నై వ్యాపారులు..!
- Miryalaguda : ఎరువుల దుకాణదారులకు వ్యవసాధికారిణి సీరియస్ హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
- Mangoes : మామిడి పండ్ల చరిత్ర తెలుసా.. ఏ పండ్లు ఎలా తింటే ఆరోగ్యమో తెలుసుకుందాం..!









